Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో పశ్చిమ ప్రాంతం నుంచి కోస్తా జిల్లాల వరకు, మరో ఉపరితల ద్రోణి కోస్తా, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న కారణంగా వీటి ప్రభావం తెలంగాణపై ఉందని పేర్కొంది. కాగా, ఆదివారం ఉదయం నుంచి నిన్న ఉదయం వరకు తెలంగాణలో 543 చోట్ల వర్షాలు కురిసినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.

More Telugu News